గచ్చిబౌలి గౌలిదొడ్డిలో ఉద్రిక్తత….

43
gopanpally

హైదరాబాద్ గచ్చిబౌలిలోని గౌలిదొడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. గోపన్ పల్లి సర్వే నెంబర్ 37 లో అక్రమంగా వెలిసిన 208 గుడిసెలను తొలగించారు. ఆర్డీఓ చంద్రకళ ఆధ్వర్యంలో 8 రెవిన్యూ బృందాలు,8 పోలీస్ బృందల తో కూల్చివేతలు చేపట్టారు.

గుడిసెల కూల్చివేతలను గచ్చిబౌలి బీజేపీ కార్పొరేటర్ గాంగధర్ రెడ్డి అడ్డుకోగా పోలీసులు అరెస్ట్ చేశారు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని, తమకు ఆధార్ కార్డ్, ఇంటి నంబర్లు, రేషన్ కార్డులు కూడా ఉన్నాయని ఇప్పుడు ఒక్కసారిగా మా ఇళ్ళు కూలిస్తే ఎక్కడికి పోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు.