తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్..

44
helicopter

తమిళనాడులోని కునూరు లో కుప్పకూలింది ఆర్మీ హెలికాప్టర్. ఆర్మీ అధికారులతో వెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలడంతో ఆర్మీ, పోలీసుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనలో ముగ్గురిని ఆర్మీ సిబ్బంది కాపాడింది. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. సమీపంలోని వెల్లింగ్ టోన్ బేస్ కు తరలించి గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. చాపర్ లో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఉన్నట్లు సమాచారం.
బిపిన్ రావత్ తో పాటు ఆయన సిబ్బంది, కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.