- Advertisement -
హైదరాబాద్ రంజాన్ మాసం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్‌లో బీద ముస్లింలకు రంజాన్ పండుగకు కావాల్సిన నిత్యావసరాలు పంపిణీ చేశారు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్. ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. బోరబండ డివిజన్ నాయకుల సహాయంతో ఈరోజు చివర ఇఫ్తార్,రేపు రంజాన్ పండుగ కాబట్టి 1000 మంది బీద ముస్లింలకు పాలు,ఫ్రూట్స్ సెమియా పంపిణీ చేసామని తెలిపారు.
సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని బీద ముస్లిం సోదర,సోదరీమణులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం చేశాం.రేపు ముస్లిం సోదరులు ఈద్,నమాజ్ తమ తమ ఇళ్లలోనే చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో చేతులు కలపడం,కౌగిలించుకోవడం కాకుండా సలాం తోనే శుభాకాంక్షలు తెలుపుకోవాలని యావత్ ముస్లిం సమాజాన్ని కోరుతున్నాను అని బాబా ఫసియుద్దీన్ అన్నారు.
- Advertisement -