ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి..ఏ2గా అఖిల ప్రియ

47
anjanikumar

హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియతో పాటు ఆమె భర్త భార్గవరామ్ పాత్ర ఉందని తేల్చారు పోలీసులు. ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించిన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌..కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా అఖిలప్రియ, ఏ3గా భార్గవ్‌రామ్‌ ఉన్నారన్నారు.

హఫీజ్‌పేట్‌లో ఉన్న భూమికి సంబంధించి ఏడాది నుంచి వివాదం నడుస్తోందని సీపీ వెల్లడించారు. కిడ్నాప్‌ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్లు తేలిందని.. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు

ఉదయం 11 గంటలకు భూమా అఖిలప్రియను అరెస్టు చేశామని..వైద్య పరీక్షల అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించామన్నారు. కిడ్నాప్‌ కేసును మూడు గంటల్లోనే ఛేదించామని తెలిపారు సీపీ.