ఆలయాలపై దాడులను ఖండించిన బాలయ్య!

29
nbk

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. హిందూపురంలో పర్యటించిన బాలయ్య…దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారి చేతులు నరికేయాలన్నారు.

ఇప్పటివరకు 127 గుళ్లపై దాడులు జరిగాయని తెలిపిన బాలయ్య.. విగ్రహాలను ధ్వంసం చేయడం కిరాతకమని మండిపడ్డారు.విజయవాడ ఇంద్రకీలాద్రిలో రథంపై మూడు వెండి సింహాలు మాయమయ్యాయని, దానిపై ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

అంతర్వేదిలో రథం దగ్ధం, శ్రీరాముడు, సీత విగ్రహాల ధ్వంసం ఇలా చాలా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని… యువత, రైతులు, కార్మికులు.. అందరూ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.