రాష్ట్రంలో భానుడి భగ భగలు..

72
weather forecast

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 36.5 నుంచి 41.9 డిగ్రీల మధ్య నమో‌ద‌వు‌తు‌న్నాయి. దక్షిణ ఛత్తీ‌స్‌‌గఢ్‌ పరి‌సర ప్రాంతాల్లో 2.1 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం స్థిరంగా కొన‌సా‌గు‌తు‌న్నది. ఉత్తర ఇంటీ‌రి‌యర్‌ కర్ణా‌టక నుంచి ఇంటీ‌రి‌యల్‌ తమి‌ళ‌నాడు వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఆవ‌ర్తనం ఏర్పడింది.

వీటి ప్రభా‌వంతో వరం‌గల్‌ రూరల్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యా‌పేట, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌ జిల్లాల్లో నేడు, రేపు ఉరు‌ములు, మెరు‌పు‌ల‌తో తేలి‌క‌పాటి వర్షం కురిసే అవ‌కాశం ఉన్నదని అధి‌కా‌రులు తెలి‌పారు. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలియజేశారు.

కాగా ఆది‌వారం మంచి‌ర్యాల, పెద్దపల్లి, జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యా‌పేట, నల్లగొండ, నాగ‌ర్‌‌క‌ర్నూల్‌, వన‌పర్తి, జోగు‌లాంబ గద్వాల, నారా‌య‌ణ‌పేట, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌ జిల్లాల్లో వడ‌గా‌లులు వీచి‌నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.