ఐపీఎల్‌ నిర్వహణ యథాతథం: సౌరభ్‌ గంగూలీ

134
Sourav Ganguly

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్‌ జరుగుతుందా లేదా అని అనుమానాలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్‌ షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని ప్రకటించాడు.

మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు కఠిన ఆంక్షల్ని ప్రకటించిన నేపథ్యంలో లీగ్‌ నిర్వహణపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన గంగూలీ ఐపీఎల్‌ నిర్వహణ యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేశారు.

మరోవైపు ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా ఏప్రిల్‌ 10-25 మధ్య ముంబయిలో 10 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. తొలి మ్యాచ్‌ ఏప్రిల్‌ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌లు ముంబయిలోనే మకాం వేసి సాధన చేస్తున్నాయి.