హైదరాబాద్‌కు వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డు

138
- Advertisement -

హైదరాబాద్‌ మహానగరానికి మరోసారి విశ్వనగరంగా గుర్తింపు లభించింది. ఇంటర్‌నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ ప్రొడ్యూసర్స్‌(ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ అధికారులుకు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు. లివింగ్‌ గ్రీన్‌ కేటగిరి కింద ఓఆర్‌ఆర్‌(ఔటర్‌ రింగురోడ్డు)కు ఈ ఆవార్డు ప్రధానంచేశారు.

దక్షిణకొరియాలో జరిగిన ఏఐపీహెచ్ కార్యక్రమంలో హైదరాబాద్‌కు ఈ ఆవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ అంతర్జాతీయ అవార్డు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో పాటు పచ్చదనం పెంపునకు ప్రభుత్వం తీసుకున్న చర్యలే ప్రధాన కారణమని తెలిపారు. భారత్ నుంచి ఈ పురస్కారం అందుకున్న ఒకే ఒక్క సిటీ మన హైదరాబాద్‌ నగరం కావడం గమనార్హం.

 

- Advertisement -