జూపార్కులో బెంగాల్‌ టైగర్‌ మృతి…

263
hyderabad bengal tiger
- Advertisement -

హైదరాబాద్‌ జూపార్కులో బెంగాల్‌ టైగర్‌ మృతి చెందింది. ఎనిమిదేండ్ల తెల్లపులి కిర‌ణ్ కుడి దవడ భాగంలో ఏర్పడిన నియోప్లాస్టిక్‌ కణితి కార‌ణంగా అనారోగ్యం పాలైంద‌ని కొన్నిరోజులుగా చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందిందని జూ అధికారులు వెల్లడించారు.

జ‌వ‌హ‌ర్‌ల్ నెహ్రూ జువాల‌జిక‌ల్ పార్కులోనే కిర‌ణ్ పుట్టి పెరిగింద‌ని…గ‌త నెల 29న ప‌రీక్ష‌లు చేయ‌గా కిర‌ణ్ కుడి ద‌వ‌డ‌లో క‌ణితి ఉన్న విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని అధికారులు తెలిపారు. మృతి చెందిన పులికి వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వ‌హించారు

కిర‌ణ్‌ తాత రుద్ర 12 ఏండ్ల‌ వయసులో ఇదే వ్యాధితో మృతి చెందగా తండ్రి బద్రి కూడా నియో ప్లాస్టిక్‌ కణితితోనే బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది.

- Advertisement -