- Advertisement -
హైదరాబాద్ పంజాగుట్టలోని పలు మటన్ షాపులను సీజ్ చేశారు జీహెచ్‌ఎంసీ అధికారులు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన మటన్‌ని అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు ఆ షాపులపై దాడులు చేసి సీజ్ చేశారు.
దీనికితోడు ఎక్కువ ధరకు మాంసం అమ్ముతుండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సీజ్ చేశారు. పంజాగుట్టలోని ఏ 1 షాపులో నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నారన్న సమాచారంతో రైడ్ చేశారు అధికారులు. రెండు మూడు రోజులపాటు మటన్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టి వినియోగదారులకు అమ్ముతున్నట్టు గుర్తించారు. నిబంధనలు పాటించనందున దుకాణాన్ని సీజ్ చేశారు.
లాక్ డౌన్ అమలవుతున్న వేళ మాంసం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మటన్ షాప్‌లో కల్తీ మాంసం అమ్మినా లేక ఎక్కువ ధరకు అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని గతంలోనే ప్రభుత్వం హెచ్చరించింది.
- Advertisement -