గాంధీ ఆస్పత్రిలో మరోవ్యక్తి ఫ్లాస్మా దానం…

343
plasma therapy
- Advertisement -

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకులో ఇద్దరు డోనర్ల దగ్గర నుండి ఫ్లాస్మాను సేకరించారు డాక్టర్లు. ఇప్పటివరకు నలుగురు ప్లాస్మా డొనేట్ చేయగా తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కారోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి (రామ తేజ) ఇవాళ ప్లాస్మా డొనేట్ చేశారని డాక్టర్లు చెప్పారు.

డోనర్ లు ఇద్దరూ కూడా కరోనా మమహ్మరిని జయించిన వారు. తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని అంతా బాగానే ఉన్నామని చెప్పారు. డాక్టర్లు చాలా ధైర్యంగా చికిత్స చేయడం వల్ల తాము కరోనాను జయించామని చెప్పారు. అందుకే తమ నుండి ఫ్లాస్మా సేకరించి ఇతర పేషెంట్లకు ఎక్కించడం వల్ల వాళ్లు కూడా కరోనా నుండి తొందరగా బయట పడతారని చెప్పారు.

డాక్టర్లు చెప్పడం వలన తాము వచ్చి ఫ్లాస్మా దానం చేస్తున్నామని దీని ద్వారా కరోనా పాజిటివ్ వ్యక్తులు త్వరగా కోలుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాజారావు గారు, కమిటి సభ్యులు డాక్టర్ సుధా మెడికల్ ఆఫీసర్ బ్లడ్ బ్యాంక్ , ఆర్ ఎమ్ ఓ డాక్టర్ లలిత, ,,బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ శ్రవణ్ ,ఖాజా, పుష్ప, ఫరీద్, వెంకట్ కౌన్సిలర్ సునీత , బాబా, స్టాఫ్ నర్స్ పాషా రషీద్ లలిత, హరి ,వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -