భారీ వర్షాలు..అప్రమత్తంగా ఉండండి

10
- Advertisement -

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, భూపాలపల్లి తదితర జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని సూచించారు పొంగులేటి. లోత‌ట్టు ప్రాంతాలు, వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా చ‌ర్య‌లు చేప‌ట్టాలన్నారు.

ప్ర‌తి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్‌లు నిరంత‌రం ప‌నిచేసేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో ఇరిగేష‌న్, విద్యుత్‌, పంచాయితీరాజ్‌, ర‌హ‌దారులు, పోలీస్ విభాగాల‌తో క‌లిసి స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలని సూచించారు పొంగులేటి.

Also Read:KTR:కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవండి

- Advertisement -