హ్యాపీ బర్త్‌ డే పూజా హెగ్డే..

18

ఆకట్టుకునే అందంతో పాటు, అభినందించదగిన అభినయం కూడా ప్రదర్శించగల హీరోయిన్ పూజ హెగ్డే. నేడు (అక్టోబర్ 13) ఈ బ్యూటీ పుట్టినరోజు.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ఆ తరవాత తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.. ఇవాళ పూజా పుట్టినరోజు సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూజ 2010లో విశ్వసుందరీ విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. తెలుగులో రెండు సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్‌లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. స్టార్ హీరో హృతిక్ రోషన్ తో  ‘మెహెన్ జోదారో’సినిమాతో మెప్పించింది. ప్రస్తుతం పూజకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు పూజా హెగ్డే నేడు 31వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం పూజా హెగ్గే  నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ విడుదల కాబోతుంది.