హుజూరాబాద్‌ ఉపఎన్నిక అప్‌డేట్‌.. 61.66 శాతం పోలింగ్‌..

163
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ కొనసాగనుంది. అయితే కొన్ని చోట్ల బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నారు. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌తో కావాల‌నే గొడ‌వ‌ల‌కు దిగుతున్నారు. ఉప ఎన్నిక ప్ర‌శాంతంగా జ‌రుగుతుండ‌డంతో ఓర్వ‌లేక‌, ఓట‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసేలా వికృతంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఒక‌వైపు బీజేపీ కార్య‌క‌ర్త‌లే పోలింగ్ బూతుల వ‌ద్ద ప్ర‌చారం చేస్తూ.. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లే ప్ర‌చారం చేస్తున్నార‌ని షో క్రియేట్ చేస్తున్నారు. అయినా, ఓట‌ర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు త‌ర‌లివ‌స్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు హుజూరాబాద్‌లో దాదాపు 61.66 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

ఈ ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎవరు విజయం సొంత చేసుకుంటారో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. నేడు జరుగుతున్న పోలింగ్‎తో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తెల్చనున్నారు.

- Advertisement -