ఆయన ప్రవచనాలు అమృతవాక్కులు: మంత్రి జగదీష్ రెడ్డి

81
- Advertisement -

ఆయన ప్రవచనాలు అమృతవాక్కులు అని,అద్భుతమైన సందేశాలను కుడా అలవోకగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శ్రీశ్రీశ్రీ త్రిదండీ చిన్నజీయర్ స్వామి గురించి మాట్లాడుతూ వర్ణించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండీ చిన్న జీయర్ స్వామి తిరునక్షత్రం(జన్మదిన) వేడుకలను పురస్కరించుకుని శనివారం ఉదయం సూర్యపేట పట్టణంలోని వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఆండాళ్ గోష్ఠి,వికాసతరంగణిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు.

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. బహుముఖ ప్రజ్ఞాశాలి జీయర్ స్వామి వారి తిరునక్షత్రం వేడుకలు జరుపుకోవడం మహనందంగా ఉందన్నారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలాతో పాటు ఆధునిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్న ఏకసందాగ్రహి జీయర్ స్వామి అని ఆయన ప్రశంసించారు. అటువంటి హిందు ధర్మప్రచారక్ కు అనుసంధానంగా ఉండి సేవలు అందిస్తున్న ఆండాళ్ గోష్ఠి,వికాస తరంగణి కార్యకర్తల సేవలు అనిర్వచనియమని ఆయన కొనియాడారు. భక్తి ప్రవత్తులు పెంపొందించడంతో పాటు క్రమశిక్షణకు దోహద పడే పలు కార్యక్రమాలు చేపడుతున్న ఆండాళ్ గోష్ఠి,వికాస తరంగణి వారిని మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, పట్టణ టి.ఆర్.ఎస్ అధ్యక్ష,కార్యదర్శి లు సవరాల సత్యనారాయణ, బూర బాల సైదులు గౌడ్, పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్,టి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్ , ఉప్పల ఆనంద్,కక్కిఱేని నాగయ్య గౌడ్, మహిళా టి.ఆర్.ఎస్ అధ్యక్షురాలు కరుణశ్రీ , ఆండాళ్ గోష్టి-వికాస తరంగణి సభ్యులు శ్రీ రంగం వల్లి, హైమావతి, పద్మ, ఉప్పల గోపాల కృష్ణ, విజయ్ కుమార్, శంకర్ ,రాము, వెంపటి రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు ,భక్త బృందం పాల్గొన్నారు.

- Advertisement -