జమ్మి మొక్కలు నాటిన ఎమ్మెల్యే రేఖా నాయక్‌..

51

హైదరాబాద్ బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ మరియు రాష్ట్ర విజయ డైరీ చైర్మన్ లోక భూమా రెడ్డిలు జమ్మి మొక్కలను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వినూత్న కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీగా వస్తోంది.

ఈ ప్రాధాన్యతల నేపధ్యంలో రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం మొదలవుతుందని బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయంలో మొక్కను నాటే కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ మరియు రాష్ట్ర విజయ డైరీ చైర్మన్ లోక భూమా రెడ్డి అన్నారు. ఇప్పటికే ఇరవై వేలకు పైగా జమ్మి మొక్కలను సిద్దం చేస్తున్నారని, అన్ని గ్రామాలు, గుడులకు పంపిణీ జరుగుతుంది అన్నారు.