హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ అప్‌డేట్…

140
huzurabad
- Advertisement -

హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభమయింది. పోలింగ్ నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయగా మొత్తం 106 గ్రామపంచాయతీల్లో 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

మొత్తం 3865 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓటర్లు తప్పకుండా మాస్క్‌ ధరించి భౌతిక దూరం పాటించాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నాయి. అయితే ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నది. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారు.

- Advertisement -