భార్యలను చంపకూదనే తలాక్ చెబుతున్నారు..

220
Riyaz
- Advertisement -

దేశ వ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న కారణాలతోనే భార్యలకు ట్రిపుల్ తలాక్ చెబుతున్న ఘటనలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ ను నిషేదిస్తూ బిల్లును తీసుకురాగా..లోక్ సభలో ఆమోదం పొందింది.. రాజ్యసభ్యలో ఇంకా పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.

Triple-Talaq

 

తాజాగా ఓ ముస్లిం నేత ట్రిపుల్ తలాక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ మైనార్టీ సెల్ చీఫ్ గా పని చేస్తున్న రియాజ్, బరేలిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ నేత మాట్లాడుతూ..ఓ భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే.. భార్యను చంపాలి లేదా తలాక్ చెప్పాలి.

అందుకే చాలా మంది భర్తలు తమ భార్యలను చంపకూదనే తలాక్ చెబుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ముస్లిం మహిళలకు న్యాయం చేయాలని ఉంటే.. ముందు ముస్లిం మహిళలకు 8 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ముస్లింల కంటే హిందువులలోనే విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలోనూ ఈ నేత సంచలన వ్యాఖ్యలు చేసి.. వార్తల్లో నిలిచారు.

- Advertisement -