అఫైర్‌ పెట్టుకోలేదని భార్యకు డైవర్స్‌..!

686
illigal affair
- Advertisement -

అవును మీరు చదివింది నిజమే. సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. అక్రమ సంబంధం పెట్టుకోలేదనే కోపంతో భార్యకు విడాకులు ఇవ్వాలని చూశాడు ఓ శాడిస్టు భర్త. వివరాల్లోకి వెళ్తె…ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో ఓ వ్యక్తి తన భార్యను వేరేవారితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. అయితే దీనికి ఆమె అంగీకరించలేదు. దీంతో ఆగ్రహంతో పుట్టింటికి పంపించేశాడు.

అయినా భార్యలో మార్పురాలేదనే కోపంతో ఆమె ఇంటి వద్దకు వెళ్లి తలాక్ చెప్పాడు. దీంతో భర్తపై మీరట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సాధారణంగా అక్రమ సంబంధాలు భార్య,భర్తల మధ్య విడాకులకు కారణమవుతాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్‌ కావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ శాడిస్టు భర్తపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -