- Advertisement -
కార్తీక మాసం చివరిసోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులతో కిక్కిరిసిపోయింది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. స్వామివారి దర్శనానికి 4గంటల సమయం పడుతుండగా భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
ఇక శ్రీశైలం మల్లన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. స్వామివార్లను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ సాయంత్రం పుష్కరిణి వద్ద చేయనున్న లక్ష దీపార్చన, దశవిధ హారతికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
- Advertisement -