ఆంగ్ల నూతన సంవత్సరాని పురస్కరించుకొని తిరుమలలో సందడి వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీ దృష్ట్యా వేకువ జాము 3 గంటలకే విఐపి బ్రేక్ దర్శనాలను ప్రారంభించింది టీటీడీ. ఉదయం ఐదు గంటలకు సర్వదర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ప్రారంభించారు టీటీడీ అధికారులు
నూతన ఆంగ్ల సంవత్సరం కావడంతో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వి.ఐ.పి విరామ సమయంలో జమ్ము కాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, రాష్ట్ర ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గుజరాత్ మంత్రి జితేంద్ర చౌదరి, తమిళనాడు మంత్రి గాంధీలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..
శ్రీవారిని టిటిడి ఈవో జవహర్ రెడ్డి దర్శించుకున్నారు.ఈ వేకువజామున రెండు గంటలకు వి.ఐ.పి విరామ సమయంలో టిటిడి ఈవో జవహర్ రెడ్డి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. నూతన సంవత్సరం కావడంతో తెల్లవారుజామున 2గంటలకే ప్రత్యేక ప్రవేశ దర్శనం పెట్టినట్లు టిటిడి ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.