లియో..తెలుగు రెస్పాన్స్ అదుర్స్

56
- Advertisement -

దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘లియో’. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఉముందుకొచ్చింది ఈ చిత్రం. ఈ చిత్ర తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో అయితే ఊహించని లెవెల్లో ఒక సెన్సేషనల్ స్టార్ట్ ని అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాల సమాచారం. లియో సినిమాకి మొదటి రోజు ఒక్క తెలుగు స్టేట్స్ గ్రాస్ మాత్రమే 15 కోట్ల మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇది విజయ్ మరియు లోకేష్ కనగరాజ్ కెరీర్ లోనే అలాగే రీసెంట్ గా వచ్చిన డబ్బింగ్ చిత్రాల్లో అత్యధికం అని చెప్పాలి. అనిరుద్ సంగీతం అందించగా 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Also Read:కుంకుడు కాయతో జుట్టు స్ట్రాంగ్ అవుతుందా?

- Advertisement -