మారుతున్న ప్రజలు… మహాయజ్ఞంలా సోషల్ డిస్టెన్స్

399
social distance
- Advertisement -

క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం చేప‌డుతున్న చ‌ర్య‌ల‌తో ప్ర‌జ‌ల్లో మార్పు క‌నిపిస్తోంది. సామాజిక దూరం పాటించాల‌ని,ప్ర‌జ‌లు ఇంట్లో నుండి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌న్న సూచ‌న‌ల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. దీంతో మ‌హాయ‌జ్ఞంలా సోష‌ల్ డిస్టెన్స్ ఉద్య‌మం సాగుతోంది.

తెలంగాణ‌,ఏపీతో పాటు ముంబైలోనూ ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.రైతు బజార్ కు వచ్చినవారిందరిని కొన్ని మీటర్ల దూరంగా ఉండేలా క్యూ పద్దతిలో ఓ సింబ‌ల్‌ని గీసి దీనిని పాటించాల‌ని అవ‌గాహ‌న తీసుకొస్తున్నారు.సామాజిక దూరం కాన్సెప్ట్ చూసిన నెటిజన్లు గవర్నమెంట్ హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తున్నారు.

సామాజిక దూరం పాటించాలన్న నిబంధనను కేంద్ర మంత్రివర్గం ఆచరణలోనూ చూపింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్‌ భేటీలో ప్రధాని సహా మంత్రులంతా దూరం దూరంగా కూర్చున్నారు.

- Advertisement -