ఆర్ఆర్ఆర్…మోష‌న్ పోస్ట‌ర్ అద్భుతం

330
rrr

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ (రౌద్రం, రణం, రుధిరం).

ఉగాది కానుక‌గా విడుద‌లైన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ గోపాల్ వర్మ, వివి వినాయక్, అఖిల్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ చాలా కనువిందుగా ఉంద‌న్నారు మెగాస్టార్ చిరంజీవి. ఉగాది రోజున ఫుల్ ఎనర్జీ నింపారు.. ఒళ్లు గగుర్పొడిచేలా ఈ మోషన్ పోస్టర్‌ను అద్బుతంగా తీర్చిదిద్దారు…కీరవాణి సంగీతం అద్భుతం అంటూ పేర్కొన్నారు.

కరోనా ప్రభావంతో ప్రజలంతా డ్రిప్రెషన్‌లోకి వెళ్లిన సందర్భంలో రాబోయే మంచి విషయాల కోసం ఎదురుచూడాలని మాకు గుర్తు చేసిన రాజమౌళికి ధన్యవాదాలు అని పేర్కొన్నాడు ఆర్జీవీ. ఇందులో కోవిడ్ లాంటి భయంకరమైన విషయాలతో పాటు గొప్ప విషయాలు కూడా ఉన్నాయ‌ని ట్వీట్ చేశారు.