కల్కి కమర్షియల్ ట్రైలర్… రెస్పాన్స్ సూపర్

392
kalki commercial trailer
- Advertisement -

ఇప్పటివరకు రాజశేఖర్ గారి మేనరిజమ్స్ ని చాలామంది ఇమిటేట్ చేశారు. రాజశేఖర్ గారే ఆయన మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? ‘ఏం సెప్తిరి… ఏం సెప్తిరి!’ డైలాగ్ ఆయన చెప్తే ఎలా ఉంటుంది? ‘కల్కి’ కమర్షియల్ ట్రైలర్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ చూపించారు.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘కల్కి’. తెలుగు ప్రేక్షకులకు ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నాచురల్ స్టార్ నాని విడుదల చేసిన ఈ సినిమా కమర్షియల్ ట్రైలర్, గురువారం థియేటర్లలోకి వచ్చిన ‘మహర్షి’ సినిమాతో పాటు ప్రదర్శిస్తున్నారు. మే 31న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా యాంగ్రీ స్టార్ రాజశేఖర్ మాట్లాడుతూ “కమర్షియల్ ట్రైలర్ విడుదల అయిన తర్వాత చాలా మంది ఫోన్లు చేశారు. మెసేజ్ లు పెట్టారు. ట్రైలర్ చాలా బావుందని, చాలా ఎంజాయ్ చేశామని చెప్పారు. సోషల్ మీడియాలో కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. రెస్పాన్స్ కి తగ్గట్టుగానే సినిమా కూడా ఉంటుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ క్యారెక్టరైజేషన్ ట్రై చేద్దాం అని చెప్పినప్పుడు…. సెట్ అవుతుందా? లేదా? అని కొంచెం టెన్షన్ పడ్డాను. ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక చాలా హ్యాపీగా ఉంది. కమర్షియల్ ట్రైలర్ లో ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కూడా ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. సి. కళ్యాణ్ గారి నిర్మాణ భాగస్వామ్యం లో ఈ సినిమా చేయడం హ్యాపీ. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులకు ఎంత నచ్చాయో… సినిమా కూడా అంతే నచ్చుతుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మా ట్రైలర్ విడుదల చేసిన నానిగారికి చాలా థాంక్స్” అని అన్నారు.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ “దర్శకుడిగా నా తొలి సినిమా ‘అ!’ నిర్మాత నాని గారు, నా రెండో సినిమా ‘కల్కి’ కమర్షియల్ ట్రైలర్ విడుదల చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అటు ‘మహర్షి’ థియేటర్లలో గాని, ఇటు సోషల్ మీడియాలో గాని… కమర్షియల్ ట్రైలర్ కు వస్తున్న స్పందన చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్ గారు నేను అడిగినది కాదనకుండా చేశారు. నన్ను నమ్మినందుకు ఆయనకు థాంక్యూ. ఆయన మేనరిజమ్స్ ఆయనే చేయడంతో ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. కమర్షియల్ ట్రైలర్ చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత రిచ్ గా ఉన్నాయో అర్థమవుతుంది. నిర్మాత సి. కళ్యాణ్ గారు ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు. అలాగే, ట్రైలర్ లో నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది. సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్ పదేళ్ల నుంచి నా ఫ్రెండ్. నా షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలకు శ్రవణ్ సంగీతం అందించాడు. మేమిద్దరం కలిసి సినిమా ఇండస్ట్రీలో ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు ఇద్దరం కలిసి ఈ సినిమా చేస్తున్నాం. ‘కల్కి’తో తనకు మరింత మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా. ‘అ!’ వంటి సినిమా చేసినా నా నుంచి ఇటువంటి ట్రైలర్ రావడంతో ప్రేక్షకుల్లో చాలామంది సర్ ప్రైజ్ అయ్యారు. దీనికి కమర్షియల్ ట్రైలర్ అని ఎందుకు పేరు పెట్టామనేది… ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అర్థమైంది. సినిమా విడుదలకు ముందు థియేట్రికల్ ట్రైలర్ విడుదల అవుతుంది. సినిమా కథేంటి అనేది అందులో తెలుస్తుంది” అని అన్నారు.

నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ “కమర్షియల్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మా హీరో రాజశేఖర్ డెడికేషన్, దర్శకుడు ప్రశాంత్ వర్మ హార్డ్ వర్క్ తో సినిమా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మే 31న చిత్రాన్ని విడుదల చేయడానికి తగిన సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

- Advertisement -