ట్రెండింగ్‌లో గీతా గోవిందం…

263
vijay devarakonda
- Advertisement -

అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌లో చేస్తున్న చిత్రం గీత‌ గొవిందం. ఈ చిత్రానికి సంబందించిన మొద‌టి సింగిల్‌ని విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకెం ఇంకెం ఇంకెం కావాలి… అనే సాంగ్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. 9 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.

గోపి సుందర్ అద్భుతమైన మెలోడియస్ సాంగ్స్ అందించగా…. సిడ్ శ్రీరామ్ ఈ అద్భుతమైన పాటను ఆలపించారు. అనంత శ్రీరామ్ అందమైన పదాలతో ఈ పాటను రచించారు. ఈ చిత్రంలో ఛలో హీరోయిన్ ర‌ష్మిక మందాన్న గీత పాత్ర‌లో న‌టిస్తున్నారు.

గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో విజ‌యం సాధించిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో… శ్రీ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

- Advertisement -