ర్యాంప్ వాక్ చేస్తూ.. అమ్మప్రేమను చాటిన మోడల్.. వీడియో

180
modelmaramartin

ఈ సృష్టిలో అమ్మ ప్రేమను మించింది మరోకటి లేదని మరోసారి నిరూపించింది ఓ మోడల్. మారా మార్టిన్ అనే మోడల్ ర్యాంప్ వాక్ చేస్తూ తన బిడ్డకు పాలిచ్చింది. స్పోర్ట్స్ ఇల్యుస్టేటెట్ మ్యాగజైన్ నిర్వహించిన వార్షిక స్విమ్ సూట్ నిర్వహించగా.. అందులో మారా కూడా పాల్గొంది. మారా ర్యాంప్ వాక్ చేసిన వీడియోని ఆ నిర్వహణ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెటిజన్లు ఆమెపై ప్రసంశల వర్షం కురిపించారు. నెటిజన్ల కామెంట్స్ తో కామెంట్స్ బాక్స్ దద్దరిల్లింది. 

Model Mara Martin

ఈ షోలో 12 ఫైనలిస్టులో మారా కూడా ఒకరు. గోల్డ్ కలర్ బికినీ ధరించి ఆకర్షణగా నిలవడంతో పాటు.. తన ఐదు నెలల కూతురికి పాలిచ్చి అక్కడున్న వారందరి మనసును గెలుచుకుంది. ఆమె చేసిన పనికి అక్కడున్న వారంతా.. నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. నేను చేసిన ఈ ర్యాంప్ వాక్ కి ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించలేదని, చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. మారా కూడా తన ర్యాంప్ వాక్ ఫోటోను తన ఇన్ స్ట్రాగ్రామ్ లో కూడా పోస్టు చేసింది.