నిర్మాత కొంపముంచిన డైరెక్టర్…

227

ఓ దర్శకుడు చేసిన పని ఓ నిర్మాత నష్టాల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో సందీప్ కిషన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మొదట్లో ఒకటి రెండు విజయాలు అందుకున్నా తరువాత అన్ని ప్లాఫ్ లు వచ్చాయి. ఆయన నటించిన ‘కేరాఫ్ సూర్య’ సినిమా నిర్మాతనే నష్టాలు చవి చూశాడు. గతేడాది నవంబర్ 10న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో రిలీజ్ అయ్యింది. కానీ తెలుగులో ఈ సినిమా ఆడలేదు. దీంతో సందీప్ కిషన్ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరై పోయాయి.

Care-Of-Surya

తమిళంలో సందీప్ కిషన్ కి ఉన్న కొద్దిపాటి క్రేజ్ వలన… పర్వాలేదని పించేలా ఆడుతుండగా.. ఆ చిత్ర డైరెక్టర్ సుశీంద్రన్ తీసుకున్న నిర్ణయం చిత్ర యూనిట్ కొంపముంచింది. సినిమా నిడివి ఎక్కువైందని.. ఓ 20 నిమిషాలు తగ్గించి.. నాలుగో రోజు మళ్లీ రిలీజ్ చేశాడు. అయినా సంతృప్తి చెందని దర్శకుడు ఈ చిత్ర ప్రదర్శనను ఆపేశాడు.. మళ్లీ ఎడిట్ చేసి డిసెంబర్ లో రిలీజ్ చేస్తానని నిర్మాతకు చెప్పాడు.

డిసెంబర్ దాటి పోయినా.. ఆ సినిమాని డైరెక్టర్ ఎడిట్ చేయలేదు. కనీసం ముట్టుకోనూ లేదు. దీంతో నిర్మాతకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. డైరెక్టర్ సుశీంద్రన్ చేసిన పనికి ఆ నిర్మాత.. పూర్తిగా నష్టపోయి రోడ్డున పడ్డాడని కోలీవుడ్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.