మాస్ అవతార్‌లో ‘ఆదికేశవ’

39
- Advertisement -

పంజా వైష్ణవ్ తేజ్ మెగా కుటుంబం నుండి వచ్చినప్పటికీ, అరంగేట్రం కోసం ‘ఉప్పెన’ వంటి విభిన్న చిత్రాన్ని ఎంచుకున్నారు. తొలి సినిమాతోనే నటుడిగా తన సత్తా నిరూపించుకోవాలని అనుకున్నారు. ఉప్పెనతో ఘన విజయాన్ని అందుకున్న ఆయన, విభిన్న జానర్‌లలో చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని నిర్ణయించుకున్నారు.

ఇప్పుడు వైష్ణవ్ తేజ్, పూర్తి మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ యూత్ ఫుల్ చిత్రం ‘ఆదికేశవ’తో రాబోతున్నారు. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’లో నటుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నవంబర్ 20న సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబి మాల్ లో జరిగిన వేడుకలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా కథానాయకుడు వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ, “ట్రైలర్ కి వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మెచ్చే సినిమాని అందించడం కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్ మాదిరిగానే సినిమా కూడా మీ అందరినీ మెప్పిస్తుంది” అన్నారు. అలాగే “నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది” అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ ని చెప్పి మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు వైష్ణవ్.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఇదొక పక్కా మాస్ సినిమా. ఇందులో యాక్షన్, ఎమోషన్, కామెడీ, సాంగ్స్ అన్నీ బాగుంటాయి. గతేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి తర్వాత ఈ ఏడాది వస్తున్న పర్ఫెక్ట్ మాస్ ఫిల్మ్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది.” అన్నారు.ట్రైలర్ ను బట్టి చూస్తే యువ దర్శకుడు, యువ హీరో కలిసి మంచి రొమాన్స్, కామెడీతో కూడిన అత్యంత స్టైలిష్ మరియు భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ఆకర్షణీయమైన కంటెంట్, విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తూ, ఎప్పుడెప్పుడు థియేటర్ కి వెళ్ళి సినిమా చూద్దామా అనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. మేకర్స్ ముందు నుండి చెబుతున్నట్టుగానే మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని అందించబోతున్నారని ట్రైలర్ రుజువు చేసింది.

ఆదికేశవ ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్‌ పాత్ర చాలా డైనమిక్ గా కనిపిస్తుంది. యువ సంచలన నటి శ్రీలీలతో అతని కెమిస్ట్రీ ట్రైలర్‌లోనే అద్భుతంగా ఉంది. ఇద్దరు మధ్య సన్నివేశాలు క్యూట్ గా ఉన్నాయి. ఈ యువ ద్వయం తెరపై అద్భుతమైన ప్రదర్శనను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది.ఇప్పటికే జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ‘సిత్తరాల సిత్రావతి’, ‘లీలమ్మో’, ‘హే బుజ్జి బంగారం’ వంటి పాటలు మాస్ మరియు యూత్ ప్రేక్షకులలో బాగా పాపులర్ అయ్యాయి. పాటలతో సినిమాపై అంచనాలను పెంచేసిన జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. ట్రైలర్ లో ఆయన పనితనం కట్టిపడేసింది.

Also Read:Revanth:రేవంత్ రెడ్డి కాదు ఊసరవెల్లి!

రాధిక వంటి సీనియర్ నటులు మరియు సుదర్శన్ వంటి ప్రతిభగల హాస్యనటుడు సినిమాకి అవసరమైన కుటుంబ భావోద్వేగాలను, హాస్యాన్ని సరైన నిష్పత్తిలో అందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదికేశవ చిత్రానికి మలయాళ నటుడు జోజు జార్జ్ చేరిక ప్రధాన బలంగా నిలిచింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది.ఈ సినిమాలో అపర్ణా దాస్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆదిక్షేశవ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. సరైన కుటుంబ మరియు హాస్య అంశాలతో కూడిన పూర్తి మాస్ యాక్షన్ బొనాంజాలా కనిపిస్తోంది. ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహించగా, డడ్లీ తనదైన కెమెరా పనితనంతో అద్భుతమైన విజువల్స్ అందించారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -