బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే అమెరికాలోని ఓ థియేటర్లో బాలయ్య అభిమానులు కాగితాలు విసిరి రచ్చ రచ్చ చేయగా.. సినిమా ప్రదర్శనను ఆపింది థియేటర్ యాజమాన్యం. అనంతరం ప్రేక్షకులను బయటకు పంపించేశారు. గతంలో తాము చాలా తెలుగు సినిమాలను ప్రదర్శించామని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని యాజమాన్యం వెల్లడించింది. మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ దెబ్బకు థియేటర్ కాసేపు షేక్ అయిపోయింది.
ఇక అమెరికాలోనే ఆ రేంజ్ రచ్చ ఉంటే, ఇక లోకల్ గా ఎంత రచ్చ ఉండాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనీ థియేటర్స్ అన్నీ ప్రస్తుతం జై బాలయ్య పేరుతో ఊగి పోతున్నాయి. మరోవైపు బాలయ్య కూడా థియేటర్స్ కి వెళ్లి ఫ్యాన్స్ సంతోషాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. హైదరాబాద్‌లోని భ్రమరాంబ థియేటర్‌లో ‘వీరసింహా రెడ్డి’ బెనిఫిట్ షోకి ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడానికి బాలయ్య అక్కడికి వెళ్ళారు. డప్పులు, బ్యాండ్ బాజాలతో తమ అభిమాన హీరోకు ప్రేక్షకులు ఘనంగా స్వాగతం పలికారు. జై బాలయ్య నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.
ఇదే ఊపు అన్నీ చోట్లా ఉంది. కానీ ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ ఉంది. సినిమాలో బాలయ్య అదరగొట్టినా.. గోపీచంద్ మలినేని మాత్రం దర్శకత్వంలో ఫెయిల్ అయ్యాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు వీరసింహారెడ్డి ఓటిటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. భారీ మొత్తం చెల్లించి ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..