ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా టోకేన్ లేని భక్తుల సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,705 మంది భక్తులు దర్శించుకోగా 25,382 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.62 కోట్లు అని అధికారులు వెల్లడించారు.
తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. మే 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ జరుగనుంది.
మే 2న ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ చేయనున్నారు. మే 3న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పుష్పయాగం, మే 12వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల ఊరేగి దర్శనం ఇవ్వనున్నారు. మే 18న అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 8 గంటలకు శ్రీ కోదండరామస్వామి ఆస్థానం జరగనుంది.
Also Read:వడ దెబ్బతో 30 మంది మృతి

