మహేష్ సినిమాలో స్టార్ హీరో విలన్?

34
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి, త్వరలో సెట్స్ పైకి వెళ్ళే ఈ ప్రాజెక్ట్ పై రోజుకో పుకారు షికారు చేస్తోంది, ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందుతుందని, పాన్ వరల్డ్ మూవీగా రాజమౌళి తెరకెక్కించబోతున్నాడని తరచూ వార్తాలు వస్తున్నాయి. అయితే వీటి విషయంలో ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక నటీనటుల విషయంలో కూడా రోజుకో వార్త వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఇండోనేషియా బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుందని, హాలీవుడ్ నటులను రాజమౌళి రంగంలోకి దించబోతున్నాడని గత కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. .

ఇప్పుడు మరో క్రేజీ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబుకు విలన్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించబోతున్నాడని వినికిడి. జంగిల్ బ్యాక్ డ్రాప్ లో అడ్వంచర్ మూవీ కావడంతో విలన్ రోల్ పవర్ ఫుల్ గా ఉండనుండట. అందుకే మహేష్ కటౌట్ కి తగినట్లుగా రాజమౌళి హృతిక్ రోషన్ ను ఎంచుకోబోతున్నట్లు వినికిడి. ఆ మధ్య అమీర్ ఖాన్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. అయితే ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న ఈ వార్తలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇకపోతే ఉగాది సందర్భంగా ఈ మూవీని అఫిషియల్ గా ప్రెస్ పెట్టి ప్రకటించేందుకు రాజమౌళి సిద్దమతున్నట్లు టాక్. ఆ రోజునే విలన్ రోల్, ఇతర నటీనటుల వివరాలు తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి బాహుబలి సిరీస్, ఆర్ ఆర్ ఆర్ మూవీస్ తో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాలకు గుర్తింపు తెచ్చిన రాజమౌళి మహేష్ సినిమాతో ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Also Read:‘భరతనాట్యం’..విజయం సాధిస్తుంది

- Advertisement -