బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఎంత గొప్ప డాన్సరో అందరికీ తెలుసు. అతని డాన్స్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ బాలీవుడ్ హీరో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ డ్యాన్స్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవల హృతిక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాది హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారు ఎలాంటి సీక్రెట్ డైట్ మెయింటైన్ చేస్తారో తెలుసుకోవాలి, అలానే డ్యాన్స్ చేసే ముందు ఏం తింటారో కూడా కనుక్కోవాలని ఉందని హృతిక్ పేర్కొన్నారు.
బన్నీ డ్యాన్స్ గురించి ప్రశ్నించగా, ఆయన ఎనర్జిటిక్, స్ట్రాంగ్, స్పూర్తిదాయకం అని హృతిక్ పేర్కొన్నాడు. అలానే తమిళ హీరో విజయ్ గురించి మాట్లాడుతూ.. నాకు తెలిసి వారు సీక్రెట్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఎనర్జీలెవల్స్ బాగుంటాయని హృతిక్ అన్నారు. డ్యాన్స్ ను ఆస్వాదిస్తూ చేయాలని హృతిక్ అన్నాడు. మనం డ్యాన్స్‌ను ఎంజాయ్ చేస్తే ముఖంలో ఆ ఫీలింగ్స్ కనిపిస్తాయని చెప్పాడు. దక్షిణాది సినిమాల్లో టెక్నాలజీని అద్భుతంగా వాడుతున్నారని ఆయన కొనియాడాడు.