వరుణ్ – లావణ్య మధ్య ప్రేమ ఎలా పుట్టింది ?

63
- Advertisement -

మణికొండలోని నాగబాబు స్వగృహంలో మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్‌చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు అరవింద్‌లు పాల్గొన్నారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం వీరి వివాహం ఆగస్టులో జరగనుంది.

అయితే ఈ జంట పై అనేక రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అసలు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని లావణ్య త్రిపాఠి ఎలా పట్టింది?, విషయం ఎంగేజ్‌మెంట్ వరకూ వెళ్లింది అంటే.. వెనుక చాలా తతంగం జరిగి ఉంటుంది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మరోపక్క వీరి మధ్య ప్రేమకు కారణం ఇదే అంటూ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వార్తల్లోకి వచ్చింది. అసలు వీరి మధ్య ప్రేమ ఇలా పుట్టింది అంటూ మధ్యలో నిహారికను పట్టుకొచ్చారు.

Also Read: తమన్నా డబ్బు కోసమెగా ఇలా ?

వరుణ్ తేజ్ సోదరి నిహారిక, లావణ్య బెస్ట్ ఫ్రెండ్స్ అట. ఇద్దరు కలిసి పార్టీలు చేసుకునేవారట. పైగా జిమ్ కూడా చేసేవారట. అదే విధంగా లావణ్య ఎప్పుడూ హైదరాబాద్ వచ్చినా.. నిహారిక దగ్గరే ఉంటుంది అని, ఈ క్రమంలోనే నిహారిక ద్వారా వరుణ్-లావణ్యల మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమగా మారిందని తెలుస్తోంది.

Also Read: ఆఫర్ల కోసం సమంత తంటాలు

- Advertisement -