రేపే గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష…

34
- Advertisement -

రేపే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు టీఎస్‌పీఎస్సీ పూర్తి చేసింది. గతంలో గ్రూప్-1 ప్రశ్నపత్రాలు లీక్ కావడం చేత తిరిగి జూన్ 11న నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకకడ్బందీగా చేశామని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 994సెంటర్లలో ఆదివారం ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 15నిమిషాల ముందే గేట్లు మూసివేయనున్నట్టు తెలిపారు. శుక్రవారం జరిగిన మీటింగ్‌లో కలెక్టర్లు ఎస్పీలు కమిషనర్లతో సమావేశమయ్యారు.

Also Read: జూన్ 14..ఎస్సై, కానిస్టేబుల్‌ ధ్రువపత్రాల పరిశీలన

ఈ సారి పరీక్షలకు అథారిటీ ఆఫీసర్లుగా కలెక్టర్లు కో-ఆర్డినేటర్లుగా సబ్‌ కలెక్టర్లను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా 1995మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించింది. మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నిరుడు ఏప్రిల్‌ 26న నోటిఫికేషన్‌ జారీచేసిన టీఎస్‌పీఎస్సీ.. అక్టోబర్‌ 16న పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 3,80,032 మందిని ఆదివారం మళ్లీ పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి వరకు 2,85,000 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొన్నారు. ఈ సారి ప్రతి పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ విధానంను అమలు చేయనున్నారు. జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు రూపొందించారు. అభ్యర్థులు బూట్లు వెసుకుని పరీక్షకు రాకూడదని చెప్పులు మాత్రమే ధరించాలని స్పష్టం చేసింది. హాల్‌టికెట్‌లో ఫోటో సరిగ్గా లేని అభ్యర్థలు 3పాస్ పోర్టు సైజ్ ఫోటోలతో గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలని తెలిపారు.

Also Read: CMKCR:కులవృత్తి దారులకు ఆర్థిక సాయం…

- Advertisement -