కిడ్నీలో రాళ్ళు తగ్గాలంటే..?

212
- Advertisement -

కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్య చాలా మందిని బాధిస్తుంటుంది. అయితే రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలావరకు నివారించుకోవచ్చని , పైగా నిమ్మరసం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నిమ్మకాయలో విటమిన్‌ సి దండిగా ఉంటుందని, సగం నిమ్మచెక్క రసం తీసుకున్నా రోజుకు అవసరమైన విటమిన్‌ సిలో ఆరో వంతుకు పైగా అందుతుందని చెప్తున్నారు.

How to Prevent Kidney Stones

అంతేకాకుండా నిమ్మరసంలో మెగ్నీషియం కూడా ఉంటుందని, ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదని, నాడులు-కండరాల మధ్య సమాచారానికి ఇది అత్యవసరం అని వెల్లడించారు. అన్ని కణాలకు పోషకాలు అందటానికి, వ్యర్థాలను బయటకు పంపటానికీ నిమ్మరసం నీళ్ళు ఉపయోగపతుందని నిపుణులు సూచిస్తున్నారు.

రోగనిరోధకశక్తిని పుంజుకునేలా చేయటంతో పాటు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. గాయాలు త్వరగా మానటానికి తోడ్పడతుంది. ఇక నిమ్మరసంలోని ఫైటోన్యూట్రియంట్లు యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -