కరోనా.. ప్రభుత్వానికి నేరుగా విరాళాలు ఇవ్వొచ్చు..

457
cm kcr
- Advertisement -

మానవాళి కరోనా వైరస్ రూపంలో కనీవినీ ఎరుగని విపత్తును ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు అని తేడా లేకుండా ప్రతీ చోటా కోవిడ్-19 ప్రబలుతున్నది. ఇటువంటి క్లిష్టతరమైన సమయంలో కరోనాను కట్టడి చేసేందుకు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వైరస్ సోకిన వారిని ప్రభుత్వ ఖర్చులతోనే ఆస్పత్రులకు చేర్చి, వైద్య అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు ప్రముఖులు తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తు ప్రభుత్వానికి చేయూతనిస్తున్నారు. అయితే ఇందుకు మీరు కూడా ఆర్థిక సాయం అందించాలనుకుంటున్నారా? మహమ్మరిపై పోరుకు మీ వంతు సహాయం చేద్దామనుకుంటున్నారా? మీరు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు నేరుగా విరాళాలు అందించవచ్చు.. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఆన్‌లైన్‌లో విరాళాలు ఇవ్వాలనుకుంటే.. Covid-19 URL–>https://ts.meeseva.telangana.gov.in/Covid/CovidContribution.htm

CM RELIEF FUND, TELANGANA STATE
Account No. 62354157651
IFSC is: SBIN0020077
SBI, Secertariat Branch,Hyderabad

- Advertisement -