మనం ఎక్కడికయినా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైల్వే స్టేషన్ కు వెళ్లి టికెట్ తీసుకోవడం ఒకప్పటి పని..కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కదా స్టేషన్ కు వెళ్లడం బదులు హాయిగా ఇంట్లో కూర్చోని ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. చాలా మంది టికెట్లను ముందుగానే బుక్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అనుకొని కారణాల వల్ల మన ప్రయాణం రద్దు కావచ్చు.. ఇలాంటప్పుడు టికెట్ క్యాన్సల్ చేసి మన డబ్బులు మనం తిరిగి పొందవచ్చు..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ట్రైన్ టికెట్లను ఆన్‌లైన్‌లోనే క్యాన్సల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
రైల్వే కౌంటర్, స్టేషన్లు, రిజర్వేషన్ ఆఫీసులు వంటి మార్గాల్లో టికెట్లను బుక్ చేసుకుంటే ఐఆర్‌సీటీసీ ఇ-టికెటింగ్ ప్లాట్‌ఫామ్ www.irctc.co.in ద్వారా టికెట్లను క్యాన్సల్ చేసుకోవచ్చు.. ఇంత ముందు వరకూ టికెట్ క్యాన్సల్ చేసుకోవాలంటే రైల్వే స్టేషన్ లేదా బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్లను క్యాన్సల్ చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను రద్దు చేసుకోవచ్చు. రైల్వే డిపార్ట్‌మెంట్ ఇందుకోసం క్యాన్సలేషన్ చార్జీలు తీసుకుంటుంది. టికెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సల్ చేయడం ఎలానో చూద్దాం..
1. మొదటగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ www.irctc.co.inకు వెళ్లండి.
2. హోమ్ పేజ్ పైభాగంలో ట్రైన్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
3.ఇందులో క్యాన్సల్ టికెట్ ఆప్షన్ కనిపిస్తుంది. కౌంటర్ టికెట్‌పై క్లిక్ చేయండి.
4.ట్రైన్ టికెట్‌పై ఉన్న పీఎన్ఆర్ నెంబర్, ట్రైన్ నెంబర్ ఎంటర్ చేయండి.
5.క్యాప్చా ఎంటర్ చేయండి. నియమనిబంధనలను అంగీకరిస్తున్నానని తెలియజేయడానికి చెక్ బాక్స్‌పై టిక్ పెట్టండి. సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి.
6.ఇప్పుడు మీకు ట్రైన్ టికెట్ బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయండి. తర్వాత పీఎన్ఆర్ వివరాలు సరిచూసుకోండి.
7. క్యాన్సల్ టికెట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ టికెట్ క్యాన్సల్ అవుతుంది.
8.టికెట్ క్యాన్సల్ తర్వాత రిఫండ్ అమౌంట్ కూడా స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అలాగే మొబైల్ నెంబర్‌కి పీఎన్ఆర్, రిఫండ్ వివరాలతో కూడిన మెసేజ్ వస్తుంది.