కళ్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ .. అప్లై చేసుకోండిలా!

43
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఆడపిల్లల వివాహ నిమిత్తం ప్రవేశ పెట్టిన పథకమే ” కళ్యాణలక్ష్మి- షాదీ ముబారక్ “. దళిత, బీసీ, గిరిజన, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఆడపిల్లల వివాహ నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. 2014 అక్టోబర్ 2 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆడపిల్లల పెళ్లి సమయంలో పెద కుటుంబాల ఖర్చుల నిమిత్తం ప్రవేశ పట్టిన ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. మొదట రూ.51 వేల రూపాయల నుంచి రూ.75 వేల రూపాయల వరకు సాయం అందించిన కే‌సి‌ఆర్ సర్కార్.. ఆ తరువాత 2018 లో లక్ష రూపాయలకు పైగా పెంచింది.ఈ పథకం ద్వారా ఎన్నో పెద కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ? అనే విషయాలను తెలుసుకుందాం !

ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ, గిరిజన, వర్గాలకు చెందిన ఆడపిల్లలు అర్హులు. అమ్మాయి వయసు కచ్చితంగా పెళ్లి చేసుకునే నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. పెళ్లి కూతురి యొక్క తల్లిదండ్రుల ఆదాయం ఎస్సీ, ఎస్సీ వారైతే ఏడాదికి రెండు లక్షల మించకూడదు. అలాగే బీసీ/ ఓబీసీ వారికి కూడా రెండు లక్షలు మించకూడదు. గ్రామాల్లో నివసించే వారి యొక్క ఆదాయం ఏడాదికి 1.5 లక్షల రూపాయలు మించకూడదు. ముఖ్యంగా వివాహం చేసుకునే అమ్మాయి తెలంగాణ రాష్ట్రనికి చెందినదై ఉండాలి.

కావలసిన డాక్యుమెంట్స్
* పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు యొక్క ఆధార్ మరియు కుల దృవీకరణ పత్రం
* బర్త్ సర్టిఫికేట్
* ఆదాయ పత్రం ( ఇన్కమ్ సర్టిఫికేట్ )
( వివాహం జరుగే తేదీకి నాటికి ఆరు నెలల లోపు మీ సేవ కేంద్రం ద్వారా జారీ చేయబడినదై ఉండాలి )
* వధువు యొక్క బ్యాంక్ పాస్ బుక్ మరియు వధువు తల్లి తల్లి యొక్క బ్యాంక్ పాస్ బుక్ మరియు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ( వధువు తల్లి )
* విఆర్ఓ లేదా పంచాయతీ సెక్రటరీ దృవీకరణ పత్రం
* వివాహ ఆహ్వాన పత్రిక
* అలాగే అడ్రస్ ఫ్రూఫ్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా సమర్పించాలి.

kఅల్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ పథకానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ( telanganaepass.cgg.gov.in ) వెబ్సైట్ లోకి వెళ్ళి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు యొక్క వివరాలు నింపి అవసరమైన డాక్యుమెంట్స్ సడ్మిట్ చేయవలసి ఉంటుంది.

ఈ పథకం ద్వారా రూ.1,00,116 వరకు ఆడపిల్లలు లబ్ది పొందుతారు.

- Advertisement -