వినూత్నంగా కళ్యాణాలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి..

92

సూర్యపేట పట్టణ కేంద్రంలో వినూత్నంగా కళ్యాణాలక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.13 వార్డుల్లోని ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు చెక్ లు పంపిణీ చేశారు. కళ్యాణాలక్ష్మి/షాదీముబారక్ పథకం కింద మొత్తం 86 లక్షల 1,376 రూపాయలను మున్సిపాలిటీ పరిధిలోమంత్రి స్వయంగా లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి చెక్కులను అందించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. నిరుపేదల కుటుంబాలలో వెలుగు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాల్ల అన్నపూర్ణ మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.