లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు ఇతర వ్యక్తులు వివిధ ప్రదేశాలలో చిక్కుకున్నవారిని తరలించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి ఇక్కడున్న వారిని వేరే రాష్ట్రాలకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించి.. ఇందుకోసం నోడల్ అధికారులను నియమించాలని కేంద్రం పేర్కొంది.
అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలని, బస్సుల ద్వారా చిక్కుకున్న వారిని తరలించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాల్లో పేర్కొన్నది. అయితే స్వంత రాష్ట్రానికి చెరుకున్న తర్వాత.. వారంతా హోమ్ క్వారెంటైన్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. స్థానిక అధికారులు టూరిస్టులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారని, ఒకవేళ వాళ్లకు హాస్పిటల్ క్వారెంటైన్ అవసరం వస్తే అప్పుడు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకునేల చేసి.. వారిని నిత్యం ట్రాక్ చేయాలి కేంద్రం ఆదేశించింది.