అనవసరంగా ప్రజలు రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి మహమ్మూద్ అలీ. లాక్ డౌన్ నేపధ్యంలో ఎల్బీనగర్ రాచకొండ క్యాంపు కార్యాలయం హొంమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈసందర్బంగా హోంమంత్రి మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో రూ.1500లతొ పాటు ఒక్కొక్కరికి 12కిలోల బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. నిత్యవసర సరుకుల రేట్లు ఎక్కువ చేసి అమ్మినవారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
కరోనా వైరస్ చాలా భయంకరమైన వ్యాధి. ప్రజలెవరు భయటకు రావద్దని చెప్పారు. కూరగాయలు సరాఫరా చేసే వాహనాలను ఎవరు అడ్డుకోరన్నారు.కూరగాయలు, నిత్య అవసరాలు సరుకులను మార్కెట్ లకు సరఫరా చేసేందుకు వచ్చే లారీలను అనుమతి ఇస్తున్నామన్నారు.నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేవారు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రధానంగా యువత రోడ్డు పైకి రాకూడదని తెలిపారు.
.