డయాలసిస్ రోగుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి..

251
Mahmood Ali Says Take Care of Dialysis Patient
- Advertisement -

లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఆసుపత్రిలకు వెళ్లి వస్తున్న డయాలసిస్ రోగుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కు సూచించారు.

హైదరాబాద్ లోని మీర్ చౌక్, ఆసిఫ్ నగర్ ప్రాంతాలలో డయాలసిస్ వ్యాధి తో బాధపడుతున్న వారిని అడ్డుకోవడం ద్వారా జాప్యం జరిగిందని ఆయా కుటుంబ సభ్యులు ఆందోళన చెందారాని హోంమంత్రి పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మరియు అడిషనల్ సి.పి అనిల్ కుమార్ లతో అన్నారు.

ఆయా రోగుల వైద్య సంబందిత పత్రాలను తనిఖీ చేసి తొందరగా వారిని గమ్య స్థానాలకు పంపేలా కింది స్థాయి సిబ్బందిని ఆదేశించాలని హోంమంత్రి పేర్కొన్నారు.

- Advertisement -