సెకండ్ వేవ్…కుంభమేళ కొంపముంచింది!

30
second

మహాకుంభమేళ కొంపముంచింది. కరోనా సెకండ్ వేవ్‌కు కుంభమేళ ప్రధాన కారణంగా తెలుస్తోంది. దాదాపు 91 లక్షల మంది యాత్రికులు హరిద్వార్ కుంభమేళను దర్శించినట్లు నిర్వాహకులు వెల్లడించగా ఇదే కరోనా విస్తరణకు కారణమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 27 వరకు మొత్తం 91 లక్షల మంది యాత్రికులు గంగలో పవిత్ర స్నానం చేసినట్లు కుంభమేళా నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం ఏప్రిల్‌ నెలలోనే వచ్చినట్లు తెలుస్తోంది. కనీసం 60 లక్షల మంది ప్రజలు ఏప్రిల్‌ నెలలో పుణ్య స్నానాలు చేశారని ఇదే మహమ్మారి విస్తరణకు కారణమైంది.

ఈ మెగా ఈవెంట్‌లోనే వైరస్‌ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. కోవిడ్ ప్రోటోకాల్‌ పెద్దగా పాటించని కారణంగా… కనీసం 100 మంది మేళా అధికారులు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో నలుగురు మరణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం హరిద్వార్‌లో ఇన్‌ఫెక్షన్ల సంఖ్య ఏప్రిల్ 1 న మొత్తం 15 వేల 226 నుండి ఏకంగా 31 వేల 596 కు పెరిగింది. అటు ఉత్తరాఖండ్‌లో 2 వేల 236 క్రియాశీల కొవిడ్ కేసులు…. కేవలం 20 రోజుల్లోనే 48 వేల 318 కు చేరుకున్నాయి. ఇదే కోవిడ్ విస్తరణకు కారణమైంది.