హాలీవుడ్ నటుల సమ్మెబాట..

55
- Advertisement -

హాలీవుడ్ నటులు సమ్మె బాటపట్టారు. తమ భవిష్యత్‌కు భద్రత కల్పించాలని,రెమ్యునరేషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ది స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ సమ్మెకు దిగింది. నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో నిరవధిక సమ్మెకు గిల్డ్‌ పిలుపునిచ్చింది.

ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమని, ఇప్పుడు కనుక తాము తమ గళం వినిపించకపోతే కష్టాల్లో పడతామని గిల్డ్ ప్రెసిడెంట్ ఫ్రాన్ డ్రెషర్ అన్నారు. అత్యాశకు పోతున్న స్టూడియోల వల్ల తాము బాధితులం అవుతున్నామని ఆరోపించారు.

రచయితలు, నటుల సమ్మెతో హాలీవుడ్ మూగబోయింది. గత 11 వారాలుగా రైటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా సమ్మెకు దిగగా తాజాగా గిల్డ్‌లో ఉన్న లక్షా 60 వేల మంది నటీనటులు సమ్మెబాట పట్టారు. ఇలా రచయితలు, నటులు ఒకేసారి సమ్మెకు దిగడం గత 63 ఏండ్లలో ఇదే తొలిసారి.హాలీవుడ్ నటుల సమ్మెతో సినిమాల రిలీజ్ ఆలస్యం కానుంది. ఇక భారీ బడ్జెట్ సినిమాల విడుదల మరింత జాప్యం కానుంది.

Also Read:Curd:పెరుగుతో అందం

- Advertisement -