సౌత్ స్టార్స్ పై షారుఖ్ స్పందన ఇదే

35
- Advertisement -

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో #AskSRK #jawan హ్యాష్ ట్యాగ్ అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని షారుఖ్‌ను.. ‘నయన్ అండ్ విజయ్‌తో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి’ అని అడగ్గా.. అందుకు షారుఖ్.. “నయన్ వెరీ స్వీట్. ఆమె పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉంది. నిజానికి నయనతార లేడీ సూపర్ స్టార్. కానీ, ఆమెకు ఆ గర్వం లేదు. అందుకే నయన్ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక విజయ్ సర్ ఒక అద్భుతం.. ఆయన ఒక మ్యాడ్ యాక్టర్. వీరిద్దరి నుంచి చాలా నేర్చుకోవచ్చు” అంటూ షారుఖ్ ఖాన్ సమాధానం ఇచ్చారు.

బాలీవుడ్ నంబర్ వన్ హీరో షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో సౌత్ హీరోహీరోయిన్ల పై ఇలా పాజిటివ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా విజయ్ అభిమానులు షారుఖ్ ఖాన్ కామెంట్స్ ను వైరల్ చేస్తూ తెగ లైక్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా జవాన్ లో నటిస్తున్నారు.

Also Read:GIC ఆధ్వర్యంలో వృక్షాలను రీలోకేట్ చేస్తాం:ఎంపీ సంతోష్

ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్ రిలీజై చాలా బాగా ఆకట్టుకుంటుంది. పైగా టీజర్ లో షారుఖ్ గుండులో దర్శనమిచ్చాడు. షారుఖ్ ఫస్ట్‌ టైమ్ సినిమాలో పూర్తి గుండుతో కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో నయనతార – షారుఖ్ ఖాన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట.

Also Read:Siddaramaiah:అలా చేస్తే రాజకీయాలకు గుడ్ బై చెప్తా

- Advertisement -