ఈయన ఆయన కాదండోయ్‌..

169
Hollywood Actors and Actresses
- Advertisement -

ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. మరి ఏడుగురు ఉంటారో లేదో కానీ..ఒకరు మాత్రం ఉన్నారు. అది కూడా ఓ హాలీవుడు హీరో.

ఇటీవలే యూపీ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ అచ్చు.. హాలీవుడ్ హీరో, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ స్టార్ విన్ డిసిల్‌లా ఉన్నారని నెటిజన్లు అంటున్నారు.  అంతేకాదు వీరిద్దరు చూడడానికి ఒకేలా ఉన్నారని, వీరిద్దరి ఫోటోలను పక్కపక్కనే పెట్టి వెరైటీ కామెంట్లు చేయడం విశేషం.
Hollywood Actors and Actresses
నిజానికి యూపీ సీఎం ఎవరు అని అడితే..హాలీవుడు హీరోనే  అనే పరిస్థితి ఇప్పుడు తయారైంది. అయితే వీరు వేర్వేరు దేశాల్లో పుట్టడం తప్ప ఇద్దరి పోలికలూ ఒక్కటేనని అంటున్నారు. యోగి ఫాస్ట్ అయితే మీడియా ఫ్యూరియస్ అని యోగి సపోర్టర్స్ వ్యాఖ్యానిస్తుండగా, కొందరు తమాషాగా జోక్స్‌తో తమ ట్విటర్లను నింపేశారు.

మరో విషయం ఏంటంటే.. బాలీవుడ్ నటి అలియా భట్‌ని యూపీ సిఎం ఎవరు అని అడిగితే విన్ డిసిల్ అని తడుముకోకుండా చెప్పిందట. దీంతో అక్కడ అన్ని చోట్లా ఇలా వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి.  ఇక మరికొంత మంది ఏమంటున్నారంటే..యోగి ఆదిత్యనాథ్ మోడ్రన్‌ డ్రెస్‌ లు వేసుకుంటే..అచ్చు హాలీవుడ్‌ హీరోలాగే ఉంటారని కూడా సోషల్‌ మీడియాలో నెటిజన్లు యూపీ సీఎం కి  తెగ కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు.

- Advertisement -