జనసేనానిపై వర్మ మళ్లీ ట్వీ….టాడు

193
Pawan-twitter
- Advertisement -

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. మళ్లీ తన ట్వీట్లతో వార్తల్లోకి వచ్చాడు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పవన్ నాకు దేవుడు అని, దేవుళ్ల స్థానంలో పవన్‌ను ఉంచాలని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

‘నాకు మొక్కలంటే ప్రేమ..’ అంటూ ఇటీవల పవన్ పేరిట ట్విటర్‌లో పోస్టు వచ్చింది. దీనిపై స్పందించిన వర్మ.. తనదైన శైలిలో దానికి కామెంట్ చేశాడు. ‘పవన్‌ కళ్యాణ్ దేవుడు అని ఎల్లప్పుడూ నమ్ముతాను. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి, భద్రాద్రి రామయ్య, బాలాజీ దేవుళ్ల స్థానాలను పవన్‌‌తో భర్తీ చేయాలి’ అని ఆర్‌జివి పేర్కొన్నాడు.

వర్మ ట్వీట్లపై పవన్ అభిమానులు  ఘాటుగా స్పందిస్తువచ్చారు. ‘ధ్రువ’ ఆడియో విడుదల వేడుకలో పవన్ సోదరుడు నాగబాబు కూడా వర్మపై ధ్వజమెత్తాడు. ఆ తర్వాత కూడా వర్మ తన తీరును మార్చుకోలేదు. టార్గెట్ మెగా ఫ్యామిలీ ట్వీట్లను సంధించాడు. ఇప్పుడు మళ్లీ పవన్ పై పంచ్ వేశాడు. మరి దీని పట్ల ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో!అయితే వర్మ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్‌ ఓ సందర్భంలో అన్నారు.

- Advertisement -