నేడు హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభం

283
Ameerpet-LB Nagar Metro
- Advertisement -

భాగ్యనగర వాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అమీర్ పేట్ -హైటెక్ సిటీ మెట్రో రైలు మార్గం ఇవాళ్టీ నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్ కూడా పూర్తి కావడంతో నేటి నుంచి మెట్రో పరుగులు పెట్టనుంది. ఇవాళ ఉదయం 9గంటలకు గవర్నర్ నరసింహన్ అమీర్ పేట్-హైటెక్ సిటీ‌ మెట్రో రైల్‌ ను అమీర్ పేట స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. వాటి ద్వారా 18 నిమిషాల్లో అమీర్‌పేట్‌ నుంచి హైటెక్‌ సిటీ చేరుకోవచ్చు.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌ గా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. దీంతో నాగోల్ నుండి శిల్పారామం వరకు ఉన్న కారిడార్ 3 మొత్తం 27 కిలో మీటర్లు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది.

ఈ కారిడార్‌లో ఇప్పటికే నాగోల్ నుండి అమీర్‌పేట్ వరకు సర్వీసులు నడుస్తుండగా… ఇప్పుడు అమీర్‌పేట్ నుంచి శిల్పారామం వరకు మెట్రో సర్వీసులు పొడిగించనున్నారు. అమీర్‌పేట్‌-హైటెక్ సిటీ మధ్య దూరం 10 కిలో మీటర్లు. ఈ మార్గంలో మధురానగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లు ఉండగా… ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్ మెట్రో స్టేషన్ల మెట్రో రైలు ఆగదు. కొన్ని రోజుల తర్వాత ఈస్టేషన్లలో మెట్రో ఆగుతుందని చెప్పారు మెట్రో అధికారులు. హైటెక్ సిటీలో సాప్ట్ వేర్ కంపెనీలు ఎక్కువగా ఉండటం వల్ల మెట్రో వల్ల కొంచెం ట్రాఫిక్ సమస్య తగ్గొంచని అంటున్నారు అధికారులు.

- Advertisement -