హితం యాప్‌ మరింత బలోపేతం..

243
hitam app

హితం మొబైల్ యాప్‌ను మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించింది ప్రభుత్వం.కరోనా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ సాంకేతికతకు పెద్ద పీట వేస్తోంది. హోం ఐశోలేశన్ లో ఉన్న పేషెంట్లకు కాల్ సెంటర్స్ ద్వారా కౌన్సిలింగ్…హితం మొబైల్ యాప్ ద్వారా డాక్టర్స్ తో టేలి మెడిసిన్ ద్వారా చికిత్స అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

హితం మొబైల్ యాప్ కి భారీ మద్దతు రావడంతో హర్షం వ్యక్తం చేసింది వైద్య ఆరోగ్య శాఖ.కరోనా వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి హాస్పిటల్స్ వెళ్లాల్సిన అవసరం రావడంలేదు.  ఇలాంటి వారందరినీ హోమ్ ఐశోలేశన్ లేక ఇన్సిట్యూషన్ ఐశోలేషన్ లో ఉంచి వీరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.హోమ్ ఐశోలేశన్ లో ఉన్నవారి ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కాల్ సెంటర్లు ఏర్పాటు చేసింది.” హితం మొబైల్ యాప్” ను అందుబాటులోకి తెచ్చి కరోనా పాజిటివ్ పేషంట్ల కి డాక్టర్స్ ద్వారా వైద్య సలహాలు అందిస్తున్నారు.

ప్రతి డాక్టర్ కి 50 మంది పేషంట్ల ను కేటాయించి 14 రోజులపాటు సలహాలు సూచనలు అందిస్తున్నారు.ప్రభుత్వ డాక్టర్స్ తో పాటు ప్రైవేట్ డాక్టర్స్ ను కూడా ఈ సేవలకోసం నియమించడం జరిగింది. పేషంట్ల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షలో కొంత మంది ప్రైవేట్ డాక్టర్స్ పని తీరు సరిగా లేదని గుర్తించడం జరిగింది. 50 మంది పేషంట్ల ను కేటాయిస్తే పది మందికి కూడా ఫోన్ చేయడం లేదని గుర్తించి అటువంటి వారిని తొలగించడం జరిగింది.యాప్ తీసి వేస్తున్నారు అంటూ వార్తలు రావడం దురదృష్టకరం. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. హితం సేవలు యదావిధిగా కొనసాగుతాయని,కరోనా పేషెంట్లకు టెలీ మెడిసిన్ ను మరింత చేరువ  చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.